Balakrishna: ‘సలార్‌’ తీసుకొచ్చిన కొత్త విలన్‌… వరలక్ష్మీకి గట్టి పోటీ!

తెలుగు సినిమాలో లేడీ విలన్‌ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ (Ramya Krishnan) . హీరోయిన్‌ టాప్‌ స్థాయికి వెళ్లిన తర్వాత లేడీ విలనీ చేశారామె. కొన్నేళ్లపాటు ఆ పాత్రలో జీవించి మెప్పించారు. ఆ తర్వాత లేడీ విలన్స్‌ అంటే టాప్‌ స్థాయిలో లేడీ విలన్స్‌ అంటే తక్కువ. కానీ ఇటీవల కాలంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) అలాంటి పాత్రలు పోషిస్తూ వచ్చింది. ఆమెకు పోటీగా టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త భామ సిద్ధమైంది. నిజానికి ఆమె కొత్త కాదు కానీ.. రీఎంట్రీలో అదరగొడుతోంది మరి.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బాబీ (K. S. Ravindra) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాలయ్య ఇటీవల సినిమాకు గ్యాప్‌ ఇచ్చి ఇప్పుడు తిరిగి సెట్స్‌ మీదకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా కాస్టింగ్‌లో కొత్త యాడింగ్‌ గురించి వార్తలు వస్తున్నాయి. సినిమాలో నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) ఓ కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. నెగెటివ్ షేడ్స్ పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె మళ్లీ అలాంటి పాత్రే చేస్తోందట.

‘పొగరు’ (Pogaru) సినిమాలో విలనీ పండించిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆ స్థాయి పేరు సంపాదించుకోలేకపోయింది. అయితే ప్రభాస్‌ (Prabhas) – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ‘సలార్’ (Salaar) సినిమా వచ్చాక తిరిగి ఫామ్‌లోకి వచ్చేసింది. అలా బాలయ్య కొత్త సినిమాలో తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభమయ్యే షెడ్యూలులో శ్రియా రెడ్డి జాయిన్ అవుతుందట. అప్పుడు మరిన్ని వివరాలు వస్తాయి అంటున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య గెటప్ అండ్ సెటప్ థ్రిల్లింగ్‌గా ఉంటుందట. ఇప్పటికే ప్రీలుక్‌లో సినిమా ఫీల్‌ చాలా డిఫరెంట్ అని చెప్పేశారు. వింటేజ్‌ బాలయ్యను చూపిస్తానని బాబీ ఇప్పటికే మాటిచ్చేశారు. అలా మాటిచ్చి ‘వాల్తేరు వీరయ్య’లో (Waltair Veerayya) వింటేజ్‌ చిరంజీవిని (Chiranjeevi) చూపించారాయన. కాబట్టి ఇప్పుడు అలాంటి బాలయ్యను చూపిస్తారని పక్కాగా నమ్మేయొచ్యు. త్వరలో సినిమా టీజర్‌ కానీ, పోస్టర్‌ కానీ వస్తుందని అంటున్నారు. అయితే ఎలాంటి క్లారిటీ లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus