Salaar: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న సలార్ చైల్డ్ ఆర్టిస్ట్.. ఏం చెప్పాడంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ కు వీక్ డేస్ లో కూడా బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో సులువుగానే 1000 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. క్రిస్మస్ సెలవు సలార్ మూవీకి బాగానే కలిసివచ్చింది. క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయింది.

సలార్ మూవీలో వరద రాజమన్నార్ చిన్నప్పటి పాత్రలో కార్తికేయ దేవ్ నటించారు. ఎంతోమందిని అడిషన్ చేసి కార్తికేయ దేవ్ ను ఆ పాత్రకు ఎంపిక చేయడం జరిగింది. అయితే కార్తికేయ దేవ్ రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అని కొంతమంది ప్రచారం చేస్తుండగా మరి కొందరు రవితేజ కొడుకు అని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు తన దృష్టికి రావడంతో కార్తికేయ దేవ్ స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టారు.

వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని రవితేజకు తాను బంధువు అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పేర్కొన్నారు. కాస్టింగ్ డైరెక్టర్ల ద్వారా నాకు సలార్ మూవీలో ఆఫర్ వచ్చిందని సలార్ సినిమా వల్ల లూసిఫర్2 సినిమాలో ఛాన్స్ దక్కిందని కామెంట్లు చేశారు. కార్తికేయ దేవ్ క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. సలార్ సినిమాతో కార్తికేయ దేవ్ కు చాలామంది అభిమానులుగా మారిపోయారు.

కార్తికేయ దేవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాబోయే రోజుల్లో మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సలార్ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Salaar) సలార్ సినిమాను మళ్లీమళ్లీ చూడటానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆసకి చూపిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus