ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. దీంతో మొదటి వారం సూపర్ గా కలెక్ట్ చేసింది. రెండో వీకెండ్లో కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ వీక్ డేస్ లో మళ్ళీ డౌన్ అయ్యింది. ఒకసారి 13 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
69.97 cr
సీడెడ్
20.87 cr
ఉత్తరాంధ్ర
16.41 cr
ఈస్ట్
9.43 cr
వెస్ట్
6.94 cr
గుంటూరు
9.09 cr
కృష్ణా
7.14 cr
నెల్లూరు
4.64 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
144.49 cr
కర్ణాటక
21.65 cr
తమిళనాడు
11.02 cr
హిందీ
58.69 cr
కేరళ
6.59 cr
ఓవర్సీస్
63.05 cr
రెస్ట్
5.00 cr
టోటల్ వరల్డ్ వైడ్
310.49 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.310.49 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.27.51 కోట్ల షేర్ ని వసూల్ చేయాలి