ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. దీంతో మొదటి వారం అద్భుతంగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. రెండో వారం కూడా పర్వాలేదు అనిపించినా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు అనే చెప్పాలి. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 70.53 cr |
సీడెడ్ | 21.24 cr |
ఉత్తరాంధ్ర | 16.74 cr |
ఈస్ట్ | 9.52 cr |
వెస్ట్ | 6.98 cr |
గుంటూరు | 9.13 cr |
కృష్ణా | 7.18 cr |
నెల్లూరు | 4.67 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 145.99 cr |
కర్ణాటక | 22.10 cr |
తమిళనాడు | 11.20 cr |
హిందీ | 60.17 cr |
కేరళ | 6.73 cr |
ఓవర్సీస్ | 63.95 cr |
రెస్ట్ | 5.8 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 315.94 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.315.94 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.22.06 కోట్ల షేర్ ని వసూల్ చేయాలి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!