ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో నిన్న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది సలార్. దీంతో మొదటి రోజు భారీగా కలెక్ట్ చేసింది. రెండో రోజు, మూడో రోజు కూడా కుమ్మేసింది అని చెప్పాలి.ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 53.54 cr |
సీడెడ్ | 15.12 cr |
ఉత్తరాంధ్ర | 11.93 cr |
ఈస్ట్ | 7.93 cr |
వెస్ట్ | 5.39 cr |
గుంటూరు | 7.78 cr |
కృష్ణా | 5.74 cr |
నెల్లూరు | 3.78 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 111.21 cr |
కర్ణాటక | 16.20 cr |
తమిళనాడు | 7.49 cr |
హిందీ | 37.25 cr |
కేరళ | 4.88 cr |
ఓవర్సీస్ | 44.30 cr |
రెస్ట్ | 2.30 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 223.63 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.223.63 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.114.37 కోట్ల షేర్ ను వసూల్ చేయాలి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!