Salaar: చరిత్ర మార్చబోతున్న ప్రభాస్.. సలార్ లాభాలు ఎంతంటే?

ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్న సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సినిమా ఏదనే ప్రశ్నకు సలార్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. సాధారణ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ సినిమా హక్కులు 170 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవగా సలార్ హక్కులు మాత్రం ఏకంగా 215 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఆంధ్ర, ఇతర ఏరియాల హక్కులు 115 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం. ఒక విధంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి. సలార్ మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా తెలుగు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే బడ్జెట్ రికవరీ కానుందని సమాచారం.

ప్రభాస్ తన సినిమాల బిజినెస్ ద్వారా చరిత్ర మార్చబోతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏడు నెలల గ్యాప్ లో ప్రభాస్ మూడు సినిమాలతో ముందుకు రానున్నారు. ఈ మూడు సినిమాలకు 2000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమాలకు 4000 కోట్ల రూపాయల నుంచి 5000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది.

సలార్ (Salaar) సినిమాలో శృతి హాసన్ జర్నలిస్ట్ రోల్ లో నటించారని సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. సలార్ సినిమా ద్వారా నిర్మాతలకు బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో లాభాలు రానున్నాయని తెలుస్తోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus