Salaar: నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘సలార్’!

  • December 27, 2023 / 07:24 PM IST

‘సలార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నిన్న మంగళవారం నాడు కూడా ఈ సినిమా నైజాంలో రూ.5 కోట్ల పైనే షేర్ ని కలెక్ట్ చేసింది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది ఈ మూవీ. అంటే 5 రోజుల్లోనే రూ.240 కోట్లు షేర్ ని కలెక్ట్ చేయడం జరిగింది.

గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.500 కోట్ల మార్క్ ని టచ్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ‘సలార్’ మూవీ ఇప్పుడు సరికొత్త రికార్డుని సృష్టించి ట్రెండింగ్ లో నిలిచింది. విషయం ఏంటంటే.. ఇప్పటివరకు తెలుగు వెర్షన్ పరంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా నిలిచింది. ఈ సినిమా ఒక్క తెలుగు వెర్షన్ తోనే వరల్డ్ వైడ్ గా రూ.160 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

ఇప్పుడు ఆ రికార్డును (Salaar) ‘సలార్’ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఒక్క తెలుగు వెర్షన్ తోనే.. అదీ 5 రోజుల్లోనే రూ.166 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి… నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ 3 సినిమాలు మూడు కూడా ప్రభాస్ నటించిన సినిమాలే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక నుండి నాన్ – ప్రభాస్ పేరిట కూడా రికార్డులు నమోదు చేయాలేమో.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus