Salaar: సలార్ లో ఎలివేషన్ సీన్లు అలా ఉంటాయా?

  • May 30, 2022 / 12:14 PM IST

దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు కాగా సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రభాస్ స్థాయికి తగిన సినిమాలు కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సలార్ సినిమా మాత్రం తమను నిరాశ పరిచే అవకాశాలు అయితే లేవని నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. సలార్ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం అందుతోంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో ఎలివేషన్ సీన్లు చూసి ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ప్రభాస్ కూడా సలార్ పై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. సలార్ తో ప్రభాస్ ఇండస్ట్రీ హిట్ సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సలార్ బడ్జెట్ పెరుగుతున్నా నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి తన వంతు కృషి చేస్తున్నారని సమాచారం.

వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. సలార్ టీజర్ తో పాటే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైందని సమాచారం అందుతోంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాకు బిజినెస్ పరంగా రెట్టింపు స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. సలార్ సినిమాతో ప్రభాస్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus