Salaar 500Cr: మరో రికార్డు కొట్టిన ప్రభాస్ ‘సలార్’ మూవీ..!

  • December 28, 2023 / 12:27 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్'(‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్) ఇటీవల రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి .. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ‘బాహుబలి 2 ‘ తర్వాత ప్రభాస్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో.. అలా చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్, ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ వంటివి అభిమానులు మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వచ్చేలా చేస్తున్నాయి.

దీంతో ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యాయి. నిన్న వీక్ డే అయినప్పటికీ ‘సలార్’ కి 60 శాతం ఫుల్స్ పడ్డాయి. అలాగే నిన్నటితో ఈ సినిమా తెలుగు వెర్షన్..’అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ ని అధిగమించి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే ఈరోజుతో ‘సలార్’ మరో రికార్డుని నెలకొల్పింది. అదేంటంటే.. ఈరోజుతో ‘సలార్’ కలెక్షన్స్ రూ.500 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది. విడుదలైన వారం రోజుల లోపే ఈ ఫీట్ ను సాధించడం అంటే మాటలు కాదు.

ఇంకా సెకండ్ వీకెండ్, న్యూ ఇయర్ హాలిడే మిగిలే ఉంది.ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు ‘సలార్’ కలెక్షన్స్ స్టడీగా ఉండే ఛాన్స్ ఉంది. నార్త్ మర్కెట్స్ లో కూడా (Salaar) ‘సలార్’ కలెక్షన్స్ ఆగేలా లేవు. కాబట్టి .. రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus