సలార్, యానిమల్ సినిమాలు కొన్నిరోజుల గ్యాప్ లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. జనవరి నెల 20వ తేదీ నుంచి సలార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా జనవరి నెల 26వ తేదీ నుంచి యానిమల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో యానిమల్ దూకుడు చూపిస్తూ ఉండటం గమనార్హం. నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ లో యానిమల్ మూవీ మొదటి స్థానంలో ఉంది.
ఇండియాతో పాటు 16 దేశాలలో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం. వ్యూస్ విషయంలో సలార్ రికార్డ్ ను యానిమల్ బ్రేక్ చేయడంతో రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. సలార్ విషయానికి వస్తే ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ ప్లేస్ లో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రెండో స్థానంలో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత ఫీలవుతూ ఉండటం గమనార్హం.
యానిమల్ మూవీ మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 20.8 మిలియన్ల గంటల వ్యూయర్ షిప్ ను నమోదు చేయడంతో పాటు 62 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. సలార్ మూవీ విషయానికి వస్తే మొదటి 10 రోజులలో 10.3 మిలియన్ గంటల వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకోవడంతో పాటు 35 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఓటీటీలో యానిమల్, సలార్ (Salaar) మధ్య గట్టి పోటీ ఉంది.
యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. యానిమల్ మూవీ ఓటీటీలో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా అంచనాలను మించి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యానిమల్ సినిమా సీక్వెల్ కూడా భారీ రేంజ్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది.