Salaar Teaser: సలార్ మూవీ టీజర్ పై క్లారిటీ వచ్ఛినట్టే.. కానీ?

  • July 25, 2022 / 06:49 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా టీజర్ కు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు నెలలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ప్రభాస్ గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రభాస్ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సలార్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటు నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమా ఉండేలా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా. సలార్ టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సలార్ టీజర్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా టీజర్ రిలీజ్ కు సంబంధించి అధికారిక అప్ డేట్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సలార్ లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. శృతి హాసన్ కెరీర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. కేజీఎఫ్2 సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించడంతో మేకర్స్ ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలకు ప్రభాస్ దూరంగా ఉండగా ఫ్యాన్స్ ప్రభాస్ ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో

ఈ సినిమాలో ప్రభాస్ అదే విధంగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ రేంజ్ ను సలార్ మరింత పెంచుతుందని బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసే సినిమా కూడా ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus