Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది… ఎలా ఉందంటే…?

ప్రభాస్ ఓ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులైంది. 2013లో వచ్చిన ‘మిర్చి’ తర్వాత అంటే 10 ఏళ్లుగా ప్రభాస్ నుండీ మరో మాస్ సినిమా రాలేదు. ‘బాహుబలి’ కంప్లీట్ గా పీరియాడికల్ డ్రామా, ‘సాహో’ కంప్లీట్ యాక్షన్ మూవీ, రాధే శ్యామ్ పీరియాడిక్ లవ్ స్టోరీ, ఇక ‘ఆదిపురుష్’ అయితే మైథలాజికల్ డ్రామా. అయితే ఈ సెప్టెంబర్ 28 న ‘సలార్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ పక్కా మాస్ మూవీ.నార్త్ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ ఎలా ఉండబోతుందో రుచి చూపించడానికి కొద్దిసేపటి క్రితం టీజర్ ను వదిలింది చిత్ర బృందం. సలార్ టీజర్ 1 నిమిషం 46 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ టీజర్ లో విలన్ గ్యాంగ్ ఓ వ్యక్తికి గన్ గురిపెడతారు. అప్పుడు అతను ప్రభాస్ పాత్రని పరిచయం చేస్తూ ఎలివేషన్స్ ఇస్తాడు.’సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే. అయితే జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే ‘ అంటూ అతను డైలాగ్ మధ్యలో ఆపడం.. ఆ తర్వాత పవర్‌ఫుల్ బీజీఎంతో… ఎలివేషన్స్ తో ప్రభాస్‌ను చూపించడం అభిమానులకి మాస్ ఫీస్ట్ ఇచ్చాయని చెప్పాలి.

రవి బస్రుర్ అందించిన బిజీయం మరోసారి టాప్ లేపేసింది అని చెప్పాలి. యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు కూడా ప్రభాస్ లో ఓ రకమైన గ్రేస్ కనిపిస్తూ ఉంటుంది. సలార్ టీజర్ లో అది మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు ప్రశాంత్ నీల్ . అందువల్ల ఈ టీజర్ ఇంకా బాగా వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఈ టీజర్ లో కనిపించాడు. ముందు నుండీ ప్రచారం చేసినట్టు గానే రెండు పార్టులుగా సలార్ రూపొందుతుంది. మొదటి పార్ట్ సీజ్ ఫైర్ పేరుతో సెప్టెంబర్ 28 న రిలీజ్ కాబోతోంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus