Prabhas: బాహుబలి ఫార్మాట్ లోనే సలార్ మూవీ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం గ్యాప్ లేకుండా పాన్ ఇండియా సినిమాలు తెరపైకి తీసుకు వస్తున్న ఏకైక హీరో ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అయితే సలార్ సినిమా టాప్ లిస్టులో ఉంది అని చెప్పవచ్చు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఏమాత్రం భయపడకుండా భారీగా ఖర్చు చేస్తున్నారు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తి కరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే బాహుబలి చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయగా ప్రభాస్ కు భారీ స్థాయిలో విజయం దక్కింది. ఆ తర్వాత దర్శకుడు ప్రశాంత్ కూడా KGF సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. చాప్టర్ 2 విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు అసలు సలార్ సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకురావాలని అనుకుంటున్నారట. సినిమాలో యాక్షన్ కు సంబంధించిన సన్నివేశాలు కాస్త ఎక్కువ సమయం పడుతుందట. ఎడిటింగ్లో ముఖ్యమైన సీన్లు చాలా వరకు ఎగిరిపోతున్నాయి అని చిత్ర దర్శకుడు ఇటీవల ఒక నిర్ణయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ కూడా రానుందట. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కాబట్టి ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చినా కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. తండ్రిగా కొడుకుగా సినిమాల్లో చాలా పవర్ఫుల్ పాత్రలలో దర్శమిస్తాడట. ఇదే ఏడాది మొదటి బాగానే విడుదల చేయనున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus