Salaar Trailer: ‘సలార్ ‘ ట్రైలర్ వచ్చేసింది ఎలా ఉందంటే?

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు దేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్ – సీజ్ ఫైర్’. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘బాహుబలి'(సిరీస్) హీరో ప్రభాస్.. కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో నార్త్ లో కూడా ‘సలార్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా..

మొదటి భాగం ‘సలార్ : పార్ట్ 1 సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న తెలుగు, కన్నడంతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది.. అందులోని డైనోసార్ ఎలివేషన్ .. ఓ రేంజ్ హైప్ ను తీసుకొచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 47 సెకన్ల నిడివి కలిగి ఉంది. దాదాపు రెండు నిమిషాల వరకు ప్రభాస్ ఎంట్రీ లేదు. రెండు నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. కష్ట కాలం ఎదుర్కొంటున్న స్నేహితుడి కోసం హీరో(ప్రభాస్) రంగంలోకి దిగుతున్నట్టు ట్రైలర్లో చూపించారు. ‘కె.జి.ఎఫ్’ ‘పొన్నియన్ సెల్వన్’.. సిరీస్..ల మాదిరి ఇందులో కూడా చాలా పాత్రలు ఉన్నాయి.

జగపతి బాబు, బాబీ సింహా, పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇలా చాలా మంది కనిపిస్తున్నారు. ప్రభాస్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప డైలాగులు వంటివి ఏమీ లేవు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఆకట్టుకుంది. భువన్ గౌడ విజువల్స్ ‘కె.జి.ఎఫ్’ ని తలపించినా గ్రాండ్ గానే ఉన్నాయి అని చెప్పాలి. (Salaar) ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus