Salaar: ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో ఈరోజు రిలీజ్ కాబోతుంది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

డిసెంబర్ 22న అంటే మరికొన్ని గంటల్లో ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 56.00 cr
సీడెడ్  25.00 cr
ఉత్తరాంధ్ర  18.00 cr
ఈస్ట్  10.00 cr
వెస్ట్  08.20 cr
గుంటూరు  10.25 cr
కృష్ణా  08.15 cr
నెల్లూరు  5.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 141.90 cr
తమిళనాడు  10.00 cr
కేరళ  05.00 cr
కర్ణాటక  30.00 cr
హిందీ 70.00 cr
ఓవర్సీస్ 75.00 cr
రెస్ట్  5.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 336.90 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)

‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చాలా పెద్దది, అయితే వీకెండ్ కలెక్షన్స్ తోనే 60 శాతం రికవరీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అంత క్రేజీ ఉంది ఈ సినిమా మీద..!

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus