Ram Charan: చరణ్‌ కోసం సల్మాన్ కథలు వింటున్నాడా?

రామ్‌చరణ్‌ను ఇప్పుడు బాలీవుడ్‌ జనాలు తెగ పొగిడేస్తున్నారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమాలో చరణ్‌ యాక్టింగ్‌ చూసి మురిసిపోయి ‘హమారా రామ్‌’ అంటున్నారు. అయితే సుమారు పదేళ్ల క్రితం ఈ మాట లేదు. దానికి కారణం ‘జంజీర్‌’ సినిమానే. ఆ సినిమా విడుదలకు ముందు, తర్వాత రామ్‌చరణ్‌ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. చరణ్‌ ఆ కల్ట్‌ మూవీ చేయడం ఇష్టం లేక కొందరు, అసలు పూర్తి చరణ్‌ ఇష్టం లేక ఇంకొందరు విమర్శించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

దాంతోపాటు చరణ్‌ ఆలోచనలు కూడా మారాయి. ఆ ఆలోచనలకు బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ హెల్ప్‌ చేస్తున్నాడట. రామ్‌చరణ్‌ సెకండ్‌ బాలీవుడ్‌ మూవీ గురించి గత కొన్ని రోజులుగా డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. చరణ్‌ తరచుగా ముంబయి వెళ్లడం, అక్కడ కొంతమందిని మీట్‌ అవ్వడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అనేది చూస్తే.. బాలీవుడ్‌ సెకండ్‌ మూవీ కోసం అంటున్నారు. దాంతోపాటు అతని వ్యాపార విస్తరణ అని కూడా చెబుతున్నారు.

రెండో విషయం సంగతి మనకు తెలియదు కానీ.. తొలి విషయం.. అదేనండీ సినిమా విషయంలో ఓ సమాచారం వస్తోంది. చరణ్‌ సెకండ్‌ బాలీవుడ్‌ మూవీ కోసం సల్మాన్‌ ఖాన్‌ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నాడట. తనకు తెలిసిన, తన దగ్గరకొచ్చిన కథలు విని.. బాగుంటే చరణ్‌ దృష్టికి తీసుకొస్తున్నాడట. ఇప్పటికే కొన్ని కథలు సల్మాన్‌ను దాటుకుని.. చరణ్‌ వద్దకు వచ్చాయి అని చెబుతున్నారు. మొన్నీమధ్య రోహిత్‌ శెట్టి చరణ్‌ కోసం ఓ కథ సిద్ధం చేశారనే వార్తలు రావడం గమనార్హం.

చరణ్‌ కెరీర్‌ విషయంలో చిరంజీవి చాలా హ్యాపీ. అయితే అది టాలీవుడ్‌ వరకే అని చెప్పాలి. అయితే చరణ్‌ను చిరంజీవి పాన్‌ ఇండియా హీరోగా చూద్దాం అనుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో దీనికి ఓ అడుగు పడింది. ఇక రెండో అడుగు బలంగా ఉండాలి. ఆని కోసమే చిరంజీవి – సల్మాన్‌ ఈ ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్నారు. చూద్దాం సల్మాన్‌ బలమైన కథను ఇటువైపు మళ్లించి సినిమాగా చేస్తాడేమో.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus