Salman Khan, Chiranjeevi: గాడ్ ఫాదర్ నుండి చిరు, సల్మాన్ ల ఫోటో లీక్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్.మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కి ఇది రీమేక్. అప్పుడెప్పుడో తెలుగులో హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఒరిజినల్ మూవీ తెలుగులో కూడా డబ్ అయ్యింది. అందుకే కథలో చాలా మార్పులు చేసినట్టు స్పష్టమవుతుంది. నయన తార, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు ఈ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నయన తార భర్త గా సత్యదేవ్ కనిపించనున్నట్లు వినికిడి.

ఇక జర్నలిస్ట్ పాత్రలో పూరి జగన్నాథ్ కనిపిస్తూ ఉండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా.. తాజాగా గాడ్ ఫాదర్ సెట్స్ నుండి ఓ పిక్ లీక్ అయ్యింది. ఇందులో చిరు, సల్మాన్ లు కనిపిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఓ బాడీగార్డ్ లా కనిపిస్తున్నాడు. ఈ పిక్ ను బట్టి చూస్తే.. గాడ్ ఫాదర్ లో ఇది క్లైమాక్స్ పోర్షన్ అనిపిస్తుంది. విలన్ సత్యదేవ్ ను చంపడానికి వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు స్టార్లు తమ బలగంతో …వెళ్తారు.

ఒరిజినల్ లో సత్యదేవ్ పాత్రని వివేక్ ఒబెరాయ్ పోషించాడు. కాబట్టి.. ఆ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. తెలుగులో సత్యదేవ్ లుక్ అంత పవర్ ఫుల్ గా ఉండదు. మరి ఈ విలక్షణమైన పాత్రని అతను ఎలా పోషిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే చిరు – సల్మాన్ ల ఫోటో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి:

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus