కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత, సౌత్‌లో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కామెంట్ చేశాడు. ‘మల్టీస్టారర్ కోసం నేటి తరం యువ హీరోలను అడుగుతుంటే ఒక్కరూ ముందు రావడం లేదు. మా ‘సెల్ఫీ’ సినిమా కోసం మరో హీరో కోసం ఇబ్బంది పడ్డాం’ అని చెప్పాడు. దీంతో ఈ విషయంలో అప్పుడు పెద్ద చర్చే జరిగింది. అయితే ఇప్పుడు ఆ చర్చ పెద్దగా వినిపించడం లేదు.
కానీ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి ఇవే తరహా కామెంట్లు చేయడం ఇప్పుడు తిరిగి ఆ చర్చ బయటకు వచ్చింది. బాలీవుడ్‌లో హీరోలకు ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువనే అర్థం వచ్చేలా అప్పట్లో అక్షయ్ కుమార్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఏకంగా ‘ఏవేవో కారణాలు చెప్పి మల్టీస్టారర్‌లు చేయకుండా నేటి తరం హీరోలు తప్పించుకుంటున్నారు’ అని అన్నాడు. 90ల కాలంలోని హీరోలు కలసి సినిమాలు చేయడానికి, స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవారని,
యంగ్ జెనరేషన్ అలా ఉండటం లేదని (Salman Khan) సల్మాన్ ఖాన్ ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఒకప్పుడు తన సినిమాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం లేదు అనుకునే సమయంలో సన్నీ డియోల్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి హీరోలతో మల్టీ స్టారర్లు చేశానని, ఆ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయని నాటి రోజపులు గుర్తు చేసుకున్నాడు సల్మాన్. మరి సల్మాన్ మాటలు ఎంతమంది యువ హీరోల్లో మార్పును తీసుకొస్తాయో చూడాలి.
అయితే మల్టీస్టారర్‌ల గురించి మాట్లాడిన సల్మాన్ ఆమిర్ ఖాన్ గురించి కూడా మాట్లాడాడు. బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో ఆమిర్ ఖాన్ కూడా వస్తే బాగుంటుంది అనేది సల్మాన్ ఆలోచన. ఇప్పటికే జైగా షారుఖ్ ఖాన్, వీరుగా సల్మాన్ ఖాన్ ఈ యూనివర్స్‌లో ఉన్నారు. త్వరలో హృతిక్, ఎన్టీఆర్ కూడా వస్తారు. అలా ఆమిర్ కూడా ఇందులోకి రావాలి అనే మాట సల్మాన్ నోట వినిపించింది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!