Salman Khan, Jacqueline Fernandez: సల్మాన్ అభిమానంతోనే అన్ని గిఫ్ట్స్ ఇచ్చాడా..?

దాదాపు రూ.250 కోట్ల స్కామ్ లో నిందితుడిగా సుఖేష్ ను తీహార్ జైల్లో పెట్టారు. ఇతడి నుంచి భారీ ఎత్తున గిఫ్ట్ లు పొందిన వారిలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కేవలం ఆమె మాత్రమే కాకుండా.. తన ఇంట్లోని వారికి కూడా సుఖేష్ భారీ ఎత్తున బహుమతులు ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలను ఈడీ విచారణలో సుఖేష్ స్వయంగా వెల్లడించాడు. జాక్వెలిన్ కి భారీ బహుమానాలు

ఇచ్చిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. సల్మాన్ కూడా ఆమెకి అత్యంత ఖరీదైన బహుమానాలు ఇచ్చాడట. ఇదివారకు సల్మాన్ తో కలిసి ‘కిక్ 2’ సినిమాలో నటించింది జాక్వెలిన్. ఆమె కెరీర్ కి అండగా నిలిచిన సల్మాన్ ఖాన్ ఆమెకి భారీ గిఫ్ట్ లు ఇచ్చాడట. అందులో ముఖ్యంగా ముంబైలోని ఖరీదైన ఏరియాలో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్.. అలానే కాస్ట్లీ ఆడీ కారు ఉన్నయట.

వీటిని తనతో సినిమాలు చేస్తున్నప్పుడు ఆమెకి బహుమతిగా ఇచ్చాడట సల్మాన్ ఖాన్. అయితే తన సహచర నటీనటులకు గిఫ్ట్ లు ఇవ్వడం సల్మాన్ కు కొత్తేమీ కాదు. ఆయన నుంచి గిఫ్ట్ లు పొందిన వారిలో కత్రినా కైఫ్, కరీనా కపూర్ లాంటి నటులు కూడా ఉన్నారు. వారితో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ఉన్నాడు. సల్మాన్ అతడికి ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.

తనతో సినిమా చేసినప్పుడు సుదీప్ కి సల్మాన్ ఆ కారుని గిఫ్ట్ చేయగా.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు సుదీప్. కారు ఫొటోలను కూడా షేర్ చేశాడు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus