టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్‌పై మళ్లీ ఫోకస్ పెట్టారు. గతంలో ‘హిట్’, ‘జెర్సీ’ రీమేక్..లతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న దిల్ రాజు తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా సల్మాన్ ఖాన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు వినికిడి. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోతున్నారు అని తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మామూలుగా అయితే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకు రెమ్యూనరేషన్ కింద వందల కోట్లు సమర్పించుకోవాలి. కానీ, దిల్ రాజు ఓ సరికొత్త డీల్‌తో సల్మాన్‌ను ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఎలాంటి భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. కేవలం నామమాత్రపు పారితోషికం తీసుకుని, సినిమా లాభాల్లో భారీ వాటా పంచుకోబోతున్నారట. దిల్ రాజు పెట్టిన ఈ ప్రపోజల్‌కు సల్మాన్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలోనే సల్మాన్‌కు దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం.ఇక వంశీ పైడిపల్లి వాస్తవానికి మొదట ఆమిర్ ఖాన్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అది కూడా దిల్ రాజు నిర్మాణంలోనే.! కానీ అది వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు సల్మాన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యాక అధికారిక ప్రకటన వెలువడనుంది.మరోపక్క ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేసే ప్లాన్‌లో దిల్ రాజు ఉన్నట్లు చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది. దానిపై కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.
