Salman Khan: ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఎఫెక్ట్‌… సల్మాన్‌ ఖాన్‌కు సెక్యూరిటీ పెంపు.. ఏమైందంటే?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు వచ్చాయి కూడా. అయితే ఇటీవల అవి మరింత ఎక్కువయ్యాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుండి సల్మాన్‌ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కూడా. మూసేవాలా హత్య తర్వాత ఈ విషయం చర్చకు వచ్చింది. తాజాగా లారెన్స్ దగ్గర నుంచి సల్మాన్‌ ఖాన్‌కు మరో హెచ్చరిక వచ్చింది. దీంతో మరింత భద్రతను ఏర్పాటు చేశారని బాలీవుడ్‌ భోగట్టా.

సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని ఇటీవల రివ్యూ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక ఫేస్‌బుక్ అకౌంట్ నుండి సల్మాన్ ఖాన్‌కు హెచ్చరిక వచ్చిందని సమాచారం. ఆ వార్నింగ్‌ ఇచ్చింది లారెన్స్ బిష్ణోయ్ అని కచ్చితంగా చెప్పలేకపోయినా… ఆ గ్యాంగ్‌స్టర్ పనే అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వార్నింగ్‌ వచ్చిన ఫేస్‌బుక్ అకౌంట్‌కు డీపీగా బిష్ణోయ్‌ ఫొటో ఉండడమే ఈ అనుమానానికి కారణం. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిష్ణోయ్ జైలులో ఉన్నాడు.

అయితే అతను జైలులో ఉన్నా (Salman Khan) సల్మాన్ ఖాన్‌పై ఎప్పుడూ కన్నేసి ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇటీవల పంజాబీ సింగర్ గిప్పీ గ్రేవాల్‌ను ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో ఇలాగే ఓ పోస్టు కనిపించింది. అందులో కూడా సల్మాన్ ఖాన్ గురించి కూడా ప్రస్తావన ఉంది. నువ్వు సల్మాన్ ఖాన్‌ని అన్న అనుకుంటావు కదా… ఇప్పుడు నీ అన్న బయటికి వచ్చి నిన్ను కాపాడాల్సిన సమయం వచ్చింది. ఈ మెసేజ్ సల్మాన్ ఖాన్‌కు కూడా. దావూద్ వచ్చి నిన్ను కాపాడతాడని అనుకోకు. నిన్ను ఎవరూ కాపాడలేరు అని ఆ పోస్టులో రాసి ఉంది.

అయితే ఈ ఫేస్‌బుక్ పోస్టును పరిశీలించిన ముంబయి పోలీసులు పోస్ట్ ఎవరు చేశారు, ఎక్కడ నుండి వచ్చింది అనే విషయాలపై నిఘా పెట్టారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్ బయటి దేశం నుండి వచ్చిందని ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలో భద్రత గురించి రివ్యూ చేశారు అని సమాచారం.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus