బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు సినిమాలో నటించబోతున్నాడని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ చేసి క్యామియో రోల్ ను తెలుగులో సల్మాన్ చేస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది నిజమేనని కొందరు.. ఫేక్ అని మరికొందరు అంటున్నారు. ఇదే విషయాన్ని చిత్రదర్శకుడు మోహన్ రాజాను అడిగితే సూటిగా సమాధానం చెప్పడం లేదు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పెట్టిన ట్విట్టర్ స్పేస్ కు అతిథిగా వచ్చిన మోహన్ ను హోస్ట్ సుమ దీని గురించి ప్రశ్నించింది. ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ నటిస్తున్న విషయం నిజమేనా.. అని అడగ్గా.. దానికి మోహన్ రాజా సమాధానం దాటవేశారు. సల్మాన్ తమ సినిమాలో నటిస్తున్నారా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దీని గురించి మాట్లాడడం తొందరపాటు అవుతుందని.. సరైన సమయంలో అన్ని విషయాలు రివీల్ అవుతాయని..
ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే అప్డేట్స్ ఉంటాయని మోహన్ రాజా చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవిని డైరెక్ట్ చేస్తుండడం గురించి చెబుతూ.. ఇలాంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటామని.. అత్యుత్తమ పనితీరుతో ఈ కథకు న్యాయం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో ఒక ఫైట్ చిత్రీకరించామని.. రెండు రోజుల గ్యాప్ తరువాత కొత్త షెడ్యూల్ మొదలుపెడతామని తెలిపారు.