Ravi Teja: రవితేజ – గోపీచంద్ సినిమా… మైత్రీ మనసులో రకరకాల ఆలోచనలు…

సూపర్‌ హిట్‌ కాంబో రవితేజ – గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో కొత్త సినిమా అంటూ కొన్ని రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమాను ఘనంగా ప్రకటించింది. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే బ్లాక్‌బస్టర్లు రావడంతో ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ వర్గాలు, ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల వస్తున్న రూమర్స్‌ ప్రకారం చూస్తే… ఈ సినిమా పట్టాలెక్కడం లేదు అని తెలుస్తోంది. ఏవేవో కారణాలు బయటకు వస్తున్నాయి కానీ… ఇరువర్గాల నుండి ఎలాంటి సమాచారం అయితే లేదు.

అయితే, పుకార్లకు ఉప పుకార్లు పుట్టినట్టు ఇటీవల మరో పుకారు బయటకు వచ్చింది. అదే ఆ సినిమాను పూర్తిగా ఆపేయకుండా హీరోను మార్చే ఆలోచనలో ఉన్నారని. అవును అది కూడా తెలుగు హీరో కాదు బయట ఇండస్ట్రీల హీరోలను చూస్తునర్నారని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. పుకార్లు నిజమైతే ఈ సినిమాలో మైత్రీ మూవీ మేకర్స్‌ చాలా ఏళ్ల నాటి బాలీవుడ్‌ కల కూడా నిజమవుతుంది. ఎందుకంటే మైత్రీ టీమ్‌ ఎప్పుడో అడ్వాన్స్‌ ఇచ్చేసిన సల్మాన్‌ ఖాన్‌ పేరు ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది కాబట్టి.

రవితేజ కోసం గోపీచంద్‌ మలినేని రాసుకున్న కథ సల్మాన్‌ ఖాన్‌కు కూడా సరిపోతుందని, ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ ట్రై చేయొచ్చని మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ అనుకుంటోందట. అందుకే రవితేజను కూడా కాకుండా ఆ సినిమా కోసం సల్మాన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. అదే జరిగితే రవితేజతో సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయంలో కూడా క్లారిటీ రావొచ్చు.

రూమర్ల ప్రకారం చూస్తే… (Ravi Teja) రవితేజ ప్రజెంట్‌ మార్కెట్‌కి, గతంలో ఓకే అనుకున్న రెమ్యూనరేషన్‌కి సెట్‌ అవ్వడం లేదట. వరుస విజయాలతో రవితేజ ఉన్నప్పుడు కాస్త ఎక్కువే ఇద్దాం అనుకోగా… ఇప్పుడు డిజాస్టర్ల ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో లెక్కలు మారి హీరో మారే పరిస్థితి వచ్చింది అంటున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus