Salman Khan: రాఖీ బాయ్ నుండీ సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తాను అంటూ సోమవారం రాత్రి ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్‌ రూమ్ కి ఫోన్ చేసి హెచ్చరించాడు. ఆ వ్యక్తి పేరు రాఖీ భాయ్ అని తెలిపినట్టు తెలిసింది.ఈ క్రమంలో అప్రమత్తమైన ముంబై పోలీసులు కేసుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఫోన్ చేసిన రాకీ భాయ్ తాను జోధ్‌పూర్ నివాసి అని, గోరక్షకుడిని అని పోలీసు కంట్రోల్‌కి చెప్పడం జరిగింది.

ఏప్రిల్ 30 న సల్మాన్ ఖాన్ (Salman Khan) ను చంపేస్తాను అని అతను బెదిరించాడు. సోమవారం నాడు రాత్రి 9 గంటలకు ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు కాల్స్ రావడం ఇది మొదటిసారేం కాదు. మార్చ్ నెలలో కూడా సల్మాన్ ఖాన్‌కు రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మార్చి 18, 23 తేదీల్లో సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గత నెలలో ఒక ఇంటర్వ్యూలో కృష్ణ జింక వివాదం కేసులో సల్మాన్ ఖాన్‌ను క్షమాపణలు చెప్పాలని కోరారు. గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌ నుంచి కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌..ను హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఎక్కడకి వెళ్ళినా ఫుల్ సెక్యూరిటీతో వెళ్తున్నాడు. ఈ మధ్యనే హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారుని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus