Salman Khan: డేంజర్ అని తెలిసినా వెనక్కి తగ్గని సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు ఆయన భద్రతపై మరింత ఆందోళన కలిగించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇటీవల సల్మాన్ సన్నిహితుడు, మహారాష్ట్ర ఎన్సీపీ నేత సిద్ధిఖి లారెన్స్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో సల్మాన్ పై కూడా ప్రాణహాని ఉందని భావిస్తున్నారు. గతంలో కూడా ఆ గ్యాంగ్ అతన్ని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు.

Salman Khan

సల్మాన్ ఖాన్ తన వృత్తి నిర్వహణ విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ఆయన ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కారు తెప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రోహిత్ శెట్టి (Rohit Shetty) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగం అగైన్’ (Singham Again) చిత్రంలో సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. దీపావళి కానుకగా నవంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. మొదట అజయ్ దేవగన్ (Ajay Devgn) సూచనతోనే రోహిత్ శెట్టి ఈ చిత్రంలో సల్మాన్ ను ప్రత్యేక పాత్రలో పెట్టాలనుకున్నారు.

భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ తన వృత్తి బాధ్యతలు పక్కాగా నిర్వహిస్తుండటం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. భద్రతా సమస్యల కారణంగా అతని గెస్ట్ రోల్ ను తీసేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నా, సల్మాన్ మాత్రం ఇచ్చిన మాట తప్పకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. ముంబైలో జరిగిన ఈ షూటింగ్ లో సల్మాన్ కీలక యాక్షన్ సీన్ లో నటించారు.

ఇటీవల జరిగిన ఈ సంఘటన సల్మాన్ వర్క్ ఎథిక్ పై సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. భద్రతా సమస్యలు ఉన్నా, ‘బిగ్ బాస్’ హిందీ షోను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా సల్మాన్ తన వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకోవడం నిజంగా ఆదర్శనీయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘సింగం అగైన్’ లో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ (Ranveer Singh) , అక్షయ్ కుమార్ (Akshay Kumar)  , టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ,  దీపికా పదుకొనే (Deepika Padukone) , అర్జున్ కపూర్ (Arjun Kapoor)  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి ఈ సారి కూడా కాప్ యాక్షన్ స్టోరీని చేసి విభిన్నంగా తెరకెక్కిస్తున్నారు.

నందమూరి అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus