Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఫిట్‌నెస్‌పై మరోసారి జోకులు… ఇన్నాళ్లూ చేసింది మోసమేనా?

బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ను కండల వీరుడు అని అంటారు. ఇన్నేళ్ల కెరీర్‌లో సల్మాన్‌ ఇప్పటికీ కండల వీరుడిగా కొనసాగుతున్నాడు. జిమ్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తదితర కారణాల వల్ల ఆయన అలా కంటిన్యూ అవుతాడు అని అంటుంటారు. 57 ఏళ్ల వయసులో కూడా సల్మాన్‌ సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తుండేసరికి.. ఆ ఆరు పలకల దేహం ఒరిజినలేనా అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. చాలా ఏళ్లుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. తాజాగా బయటికొచ్చిన ఓ వీడియో ఇప్పుడు ఆ ప్రశ్నకు బలం చేకూర్చేలా ఉంది.

సినిమాల్లో సల్మాన్‌ ఖాన్‌ షర్ట్‌ విప్పే సన్నివేశాలు కచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అతని బాడీకి అంతమంది ఫ్యాన్స్‌ ఉన్నారు కాబట్టి. ఒకవేళ యాక్షన్‌ సీన్స్‌లో కాకపోయినా పాటల్లో అయినా తన మస్క్యులర్‌ బాడీని చూపించే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు. ఈ క్రమంలో సిక్స్‌ప్యాక్‌ బాడీని చూపిస్తుంటారు. అయితే ఆ సిక్స్‌ప్యాక్‌ ఒరిజినల్‌ కాదు అని అంటుంటారు కొంతమంది బాలీవుడ్‌ జనాలు. దీనికి తాజా వీడియోను ఉదాహరణగా చెబుతున్నారు. సల్మాన్ ఖాన్‌కు సిక్స్ ప్యాక్ బాడీ లేదని, పెద్ద పొట్ట ఉందని అంటుంటారు.

ఆ పొట్టను విజువల్‌ ఎఫెక్ట్స్‌లో మేనేజ్‌ చేసి సిక్స్‌ ప్యాక్‌ ఉన్నట్లు చూపిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఇది నిజం అనేలా ఓ ఫ్యామిలీ ప్యాక్‌ వీడియో కనిపిస్తోంది. నిజానికి ఇది కొత్త వీడియో కాదు… ఒక ఏడాది క్రితమే ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడెఎందుకో మళ్లీ ఆ వీడియోను బయటకు తీసుకొచ్చారు. అందులో సల్మాన్‌కు బాణడు పొట్ట ఉంది. ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సమయంలోనిది ఆ వీడియో అని సమాచారం.

ఇక సల్మాన్‌ సినిమాల సంగతి చూస్తే… ఇదిలా ‘టైగర్ 3’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కట్రినా కైఫ్‌ కథానాయిక. దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus