Salman Khan: పాధఘట్టంలో సల్మాన్ ఖాన్ సినిమా!

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అత్యధిక డిజాస్టర్ గా నిలిచిన సినిమాల్లో ఆచార్య మొదటి స్థానంలో సినిమా కొనసాగుతోంది. ఇప్పటివరకు అయితే ఇదే అతిపెద్ద నష్టాలను కలిగించిన సినిమా. ఇక సినిమా పై పెట్టిన పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్ అయితే చాలా తక్కువ. దాదాపు 80 కోట్ల వరకు నష్టాల మిగిల్చిన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా బడ్జెట్ లో ఎక్కువగా ఖర్చు పెట్టింది మాత్రం పాధఘట్టం అనే ఒక ప్రత్యేకమైన సెట్ కోసమే.

ఆ సెట్ కోసం నిర్మాత దాదాపు పది కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్ అయితే వచ్చింది. అంతేకాకుండా టెంపుల్ కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. కోకాపేట ల్యాండ్ లో నిర్మించిన ఆచార్య టెంపుల్ టౌన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. కానీ కథాంశం విషయంలో మాత్రం కొరటాల శివ తీవ్రస్థాయిలో నిరాశపరిచాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్ట్ డైరెక్టర్ పనితనానికి అందరూ మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే సెట్ లో విలేజ్ ను అటు ఇటు గా మార్చేసి మరొక కొత్త సినిమాను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా మరేదో కాదు సల్మాన్ ఖాన్ నటించబోతున్న కబీ ఈద్ కభీ దీవాలి సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతోంది. ఇక రెగ్యులర్ షూటింగ్ నేమ్ వచ్చే నెలలో స్టార్ట్ చేయబోతున్నారు. ఫర్హాడ్ సంజీ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ క్లారిటీ అయితే క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం కొన్ని ప్రీ ప్రొడక్షన్ పనుల విషయంలో దర్శకుడు బిజీగా ఉన్నాడు. త్వరలోనే అఫీషియల్ గా సినిమాను మొదలు పెట్టి ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus