Samantha: న్యూయార్క్ కి సమంత.. 4 నెలలు కష్టమేనట..!

సమంత నటించిన ఖుషి రిలీజ్ కి రెడీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. గతంలో ఈయన నిన్ను కోరి, మజిలీ , టక్ జగదీష్, వంటి సినిమాలు తీశాడు. అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి. ఖుషి టీజర్ , ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి సమంత హాజరు కాలేదు. దీంతో ఆ సినిమా ప్రమోషన్లకి ఆమె హాజరయ్యే అవకాశాలు లేవు అని అంతా అనుకున్నారు. కానీ ఆగస్టు 15 న జరిగిన ఆడియో వేడుకకు ఆమె వచ్చింది. స్టేజ్ పై ఆమె హీరో విజయ్ తో కలిసి డాన్స్ చేయడం కూడా జరిగింది. ఆ ఒక్క వీడియోతో సినిమాకి భీభత్సమైన ప్రమోషన్ వచ్చేసింది అని చెప్పాలి.దీంతో సమంత .. ఖుషీ ప్రమోషన్ విషయంలో తన వంతు భాద్యత ఫినిష్ చేసినట్టే అని చెప్పాలి.

అందుకే అనుకుంట ఆమె న్యూయార్క్ కి చెక్కేసింది. సమంత (Samantha) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భంలో చికిత్స నిమిత్తం ఆమె అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. నాలుగైదు నెలల పాటు ఆమె అక్కడే ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తమిళంలో ప్రమోషన్ వేడుక నిర్వహిస్తే… ఆమె అక్కడికి వెళ్లే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus