Samantha: అలాంటి వాటిని పట్టించుకోవడమే మానేశా..సమంత!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇక పోతే తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె ప్రతి ఒక్క విషయాన్ని ఎన్నో రకాల పోస్టుల ద్వారా తనలో ఉన్న భావాలను బయట పెడుతున్నారు.

ఈ విధంగా సమంత తన బాధను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇలా తన బాధను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడం వల్ల ఎంతోమంది అభిమానులతో నేరుగా కనెక్ట్ కావచ్చని ఈమె భావిస్తారు.ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వ్యవహారశైలి గురించి పెద్ద ఎత్తున ఎన్నోరకాల నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ వచ్చాయి. మొదట్లో ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చూసి ఆ బాధతో ఎన్నో నిద్ర లేని రాత్రులను కూడా గడిపానని సమంత తెలియజేశారు.

ప్రస్తుతం ఇలాంటి నెగిటివ్ కామెంట్లను ఎదుర్కోవడం బాగా అలవాటైపోయిందని తెలిపారు.అందుకే తన గురించి వచ్చే నెగిటివ్ కామెంట్ గురించి పట్టించుకోవడం మానేసానని సమంత వెల్లడించారు. అయితే నిజమైన తన అభిమానులు చేసే సద్విమర్శలను తాను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా తనని తాను మార్చుకుంటానని ఈమె తెలియజేశారు.ఇలా సమంత పూర్తిగా తన జీవితంలో ఒంటరి ప్రయాణం చేయడం కోసం తనని తాను దృఢ పరుచుకుని ముందుకు వెళ్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సమంత సినిమాల విషయానికి వస్తే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ పాటతో ఈమె ఎన్నో ప్రశంశలు అందుకున్నప్పటికీ, అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.ఇక సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా ప్రస్తుతం యశోద, ఖుషి సినిమా షూటింగులతో సమంత బిజీగా ఉన్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus