సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ చిత్రం ఇటీవల అంటే ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో థియేటర్లలో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. మొదటి వీకెండ్ ముగిసేసరికి రూ.10 కోట్ల గ్రాస్ ను కూడా కలెక్ట్ చేయలేకపోయింది ఈ చిత్రం. ‘శాకుంతలం’ ఫలితం వల్ల గుణశేఖర్ పోయిందేమి లేదు. అతను పెట్టిన బడ్జెట్ చాలా వరకు రికవరీ అయిపోయింది.
5 నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్ ను కంప్లీట్ చేసినట్లు అతను తెలిపాడు. మేకింగ్ విషయంలో అతను ఎక్కువ ఖర్చు చేసింది లేదు. అతను కచ్చితంగా రానాతో సురేష్ బాబు నిర్మాణంలో ‘హిరణ్యకసిప’ చేసుకుంటాడు. ఎటొచ్చి ‘శాకుంతలం’ వల్ల సమంత, దిల్ రాజు.. వంటి వారికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. సమంత మొదట ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసింది. తర్వాత గుణశేఖర్ కన్విన్స్ చేయడం..
దీంతో రకరకాల కాలిక్యులేషన్స్ వేసుకుని ఆమె (Samantha) ఓకే చెప్పడం జరిగింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆమెకు ‘శాకుంతలం’ పెద్ద ఝలక్ ఇచ్చిందని చెప్పాలి. ఇక నిర్మాత దిల్ రాజుకు కూడా ఇది వేస్ట్ ప్రయత్నమనే చెప్పాలి. ఆయనే ఈ చిత్రాన్ని 3D కి మార్చి రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ‘శాకుంతలం’ ని దర్శకుడు గుణశేఖర్ అద్భుతంగా తీసాడని, ప్రేక్షకులకు నచ్చితే ఈ చిత్రాన్ని ఆస్కార్ కు కూడా పంపుతామని చెప్పాడు.
రిలీజ్ కు 4 రోజుల ముందు ప్రీమియర్స్ కూడా వేయించాడు. ‘బలగం’ లా ‘శాకుంతలం’ కి కూడా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు భావించాడు. కానీ ఆయన ఆశించింది ఏమీ జరగలేదు. భవిష్యత్తులో ఇలాంటి మైథలాజికల్ సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా చేయాలంటే..దిల్ రాజు భయపడే స్టేజ్ కు ‘శాకుంతలం’ తీసుకెళ్ళింది.