దేశవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమమం ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సౌత్ లో సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఓ పాపులర్ రచయిత తనను వేధించాడని గతంలో ఆరోపణలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.చిన్మయికి అండగా సమంత కూడా మద్దతు పలికింది. ఈ క్రమంలో చిన్మయికి కొందరు మద్దతు పలుకుతుంటే.. మరికొందరు చిన్మయి ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో.. ఇండస్ట్రీ ‘పెద్ద మనుషుల’ కారణంగా చిన్మయికి అవకాశాలు రావడం లేదు. అయితే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం ద్వారా తమిళ డబ్బింగ్ చెప్పే అవకాశం దక్కింది చిన్మయికి.
ఈ విషయం పై ట్విటర్‌లో సమంతకు ధ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. ‘ సమంతకు తమిళ్‌లో డబ్బింగ్ చెప్పాను. నిజానికి నందినిరెడ్డి, సమంత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అంటూ ఆ ట్వీట్లో పేర్కొంది. ఈ క్రమంలో ఎంతో మంది చిన్మయికి మద్దతునిస్తుండగా.. మరికొందరు మాత్రం.. ‘ఫెమినిస్టులు అందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. ఈ సినిమా ప్లాఫవ్వడం ఖాయం’ అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో చిన్మయికి సమంత అండగా నిలబడింది. ‘ థ్యాంక్యూ… ప్రపంచం ఓ మూర్ఖున్ని కలిసింది. ఓ మూర్ఖుడు ప్రపంచంలోకి వచ్చాడు’ అంటూ సమంత ఘాటుగా స్పందించింది.