Samantha: ‘సిటడెల్‌’ చేయనని చెప్పి.. వాళ్ల పేర్లు సజెస్ట్‌ చేసిన సమంత.. ఎవరంటే?

తాను నటించిన సినిమాను చూడను, చూడలేను అని ఎవరైనా అనుకుంటారా? కచ్చితంగా అనుకోరు. ఎంత బాగోలేకపోయిన సినిమా అయినా ఓసారి చూడటానికి ఇష్టపడతారు. కానీ ఏమైందో ఏమో సమంత తన వెబ్‌సిరీస్‌ను చూడాలని అనుకోవడం లేదు. ఇప్పటికే స్ట్రీమింగ్‌ మొదలై అందరూ చూస్తున్న ‘సిటడెల్‌’ సిరీస్‌ గురించి సమంత ( Samantha) ఈ మాటలు చెప్పింది. ‘సిటడెల్‌’ వెబ్‌ సిరీస్‌లో కొత్త సమంతను చూస్తున్నామని ఓవైపు ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎందుకంటే సామ్‌లోని యాక్షన్‌ కోణాన్ని ఆ వెబ్‌సిరీస్‌ ద్వారా చూపించారు దర్శక ద్వయం రాజ్‌ డీకే.

Samantha

అయితే ఆ సిరీస్‌ చూడలేకపోతున్నానని సమంత చెప్పింది. సిరీస్‌ ప్రచారంలో భాగంగా సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులోనే ఈ విషయం తెలిపింది. ‘సిటడెల్‌’ వెబ్‌సిరీస్‌ను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సమయంలోనే ఈ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొన్నాను. సెట్‌లో చాలా కష్టంగా రోజు గడిచిన సంద్భాలూ ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను.

ఇప్పుడు ఆ సిరీస్‌ చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. దాంతో బాధాకరంగా, కష్టంగా అనిపిస్తోంది. అందుకే మొదటి ఎపిసోడ్‌ మాత్రమే చూశాను అని చెప్పింది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో వెబ్‌సిరీస్‌ల్లోకి వచ్చిన సామ్‌.. ఇప్పుడు ‘సిటడెల్‌’తో రెండో విజయం అందుకుంది. ఇక హ్యాట్రిక్‌ కోసం ‘రక్త్‌బ్రహ్మాండ్‌’ అనే సిరీస్‌ ఓకే చేసింది. మరోవైపు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను సమంత ఇటీవల అనౌన్స్‌ చేసింది.

ఆ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తోంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమా రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఇక ఇదే ఇంటర్వ్యూల్లో సమంత తన పెళ్లి, విడాకులు, ఎక్స్‌ కోసం పెట్టిన ఖర్చులు అంటూ నాగచైతన్య (Naga Chaitanya) టాపిక్‌ను ప్రస్తావిస్తూనే వస్తోంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతోంది అనే డౌట్‌ మీకు వచ్చి ఉండొచ్చు. దానికి ఆన్సర్‌ సమంతనే చెప్పాలి. ఎందుకంటే ఆ టాపిక్‌ ఆమెనే ఎక్కువగా మాట్లాడుతోంది కాబట్టి.

ధనుష్‌ – నయనతార వివాదం.. తన ఇన్వాల్వ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన పార్వతి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus