Samantha: రెమ్యూనరేషన్‌ రచ్చ.. మళ్లీ మొదలుపెట్టిన సమంత.. ఏమందంటే?

హీరో – హీరోయిన్ల రెమ్యూనరేషన్ల మధ్య గ్యాప్‌ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. హీరోలకు ఎక్కువ ఇస్తారు, హీరోయిన్లకు తక్కువ ఇస్తారు అంటూ చాలా ఏళ్లుగా డిస్కషన్‌ టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా వినిపిస్తూ ఉంది. దీనికి ఎంతోమంది ఎన్నో రకాల వాదనలు వినిపిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా అయితే ఈ మాట టాలీవుడ్‌లో పెద్దగా వినిపించడం లేదు. కానీ తాజాగా ప్రముఖ కథానాయిక సమంత (Samantha) కామెంట్లతో మరోసారి చర్చలోకి ఈ విషయం వచ్చింది.

Samantha

రెమ్యూనరేషన్ల విషయంలో హీరోయిన్స్‌ ఇండస్ట్రీలో చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారని చెప్పిన సమంత (Samantha).. సినిమా కోసం ఇద్దరూ ఒకేలా కష్టపడుతున్నప్పుడు పారితోషికాల్లో వ్యత్యాసం ఎందుకని సమంత మరోసారి ప్రశ్నించింది. నేను చాలా సినిమాల్లో నటించాను. సమానమైన డిమాండ్‌ ఉన్న పాత్రలు చేసినప్పటికీ రెమ్యూనరేషన్‌ విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. పరిశ్రమలో నన్ను ఇబ్బందిపెట్టే విషయాల్లో ఇది ఒకటి. అందుకే నేను నా సినిమాలకు ఈ విషయంలో ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు అని చెప్పుకొచ్చింది సమంత.

ఆమె సినిమా అంటే.. నటిస్తున్న సినిమా కాదు, నటిస్తూ నిర్మిస్తున్న సినిమా అని. గతంలో ఉన్న పరిస్థితులను మార్చలేను. మార్పు నాతోనే మొదలవ్వాలని నా నిర్మాణ సంస్థలో పారితోషికం విషయంలో వ్యత్యాసం లేకుండా చూసుకుంటున్నాను అని చెప్పింది. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా నటిస్తూ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో పనిచేసిన వారికి లింగ భేదం లేకుండా సమానంగా వేతనాలు ఇచ్చారట.

గతంలోనూ పారితోషికం విషయంలో సమంత మాట్లాడింది. నేను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పరోక్షంగా పోరాడుతున్నాను. అయితే హీరో, హీరోయిన్లకు సమానంగా పారితోషికం ఇవ్వాలని పోరాడటం లేదు. కష్టాన్ని చూసి రెమ్యునరేషన్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. అలాగే సినిమా కోసం పడ్డ శ్రమ చూసి ‘మేము మీకు ఇంత రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని అనుకుంటున్నాం’ అని ఆ సినిమాకు చెందినవాళ్లే చెప్పాలి. అంతే కానీ ఇంత ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు అని అప్పట్లో చెప్పింది.

ఆ హీరో సౌత్‌ సినిమాలతోనే బిజీ అనుకుంటే.. బాలీవుడ్‌లో రెండోది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus