Samantha: ఆ విషయం మాటల్లో చెప్పలేనంటున్న సమంత!

గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో పుష్ప ది రైజ్ ఒకటనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేశారు. ఊ అంటావా ఊహూ అంటావా అనే లిరిక్స్ తో సాగిన ఈ పాట సమంతకు ఊహించని స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టింది. యూట్యూబ్ లో ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. సమంత స్పెషల్ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయగలదని పుష్ప ది రైజ్ తో ప్రూవ్ అయింది.

Click Here To Watch Now

ఊ అంటావా సాంగ్ కొరకు సమంత ఏకంగా కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సమంత తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టారు. తాజాగా సమంత ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరై అభిమానులు తనపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తున్నారని ఆ ప్రేమాభిమానాలను మాటల్లో చెప్పలేనని అన్నారు. ఊ అంటావా సాంగ్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కుతుందని తాను అస్సలు ఊహించలేదని సమంత వెల్లడించారు.

ఊ అంటావా సాంగ్ వల్ల టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అందరూ తాను చేసిన సినిమాలను మరిచిపోయారని ప్రేక్షకులు ప్రస్తుతం తనను ఊ అంటావా సాంగ్ తోనే గుర్తు పెట్టుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లోని రాజీ పాత్రతో పాన్ ఇండియా నటిగా సమంత గుర్తింపును సంపదించుకోగా ఊ అంటావా సాంగ్ సమంత పాపులారిటీని మరింత పెంచింది.

శాకుంతలం, యశోద సినిమాలతో ఈ ఏడాది సమంత సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలతో సమంత అనుకున్న స్థాయిలో ఫలితాలు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది. సమంత మార్కెట్ ను మించి ఈ సినిమాలకు ఖర్చు చేశారని తెలుస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus