రంగస్థలం లిప్ లాక్ సీన్ గురించి సమంత స్పందన.!
- April 10, 2018 / 05:26 AM ISTByFilmy Focus
“రంగస్థలం” సినిమాలో చిట్టిబాబు తాను ఇష్టపడ్డ రామలక్ష్మికి తనంటే ఇష్టం లేదేమో అనే భ్రమలో ఉండగా.. రామలక్ష్మి “నువ్వంటే నాకు ఇష్టం చిట్టిబ్బాబు” అని బాధపడుతూ చెప్పినా చిట్టిబాబుకి ఉన్న వినికిడి సమస్య కారణంగా ఆ మాట సరిగా వినబడదు. అప్పుడు తన ప్రేమను చిట్టిబాబుకి వినపడేలా అరవలేని రామలక్ష్మి అతడి ఆధారాలను ఘాడంగా చుంబించి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఈ సన్నివేశాన్ని సుకుమార్ రాసుకున్న విధానం,
ఆ సన్నివేశంలో రామ్ చరణ్-సమంతల నటన పతాక స్థాయిలో ఉంటుంది. “రంగస్థలం” రిలీజ్ తర్వాత మీడియాతో ముచ్చటించిన సమంతను “పెళ్ళైన తర్వాత లిప్ లాక్ సీన్ చేయడం ఇబ్బంది అనిపించలేదా” అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా “ఇదే క్వశ్చన్ పెళ్ళైన హీరోలను ఎందుకు అడగరు, సినిమాలో నిజానికి లిప్ లాక్ అనేది లేదు. అది కేవలం కెమెరా టెక్నిక్. అయితే.. ఒకవేళ సన్నివేశానికి అవసరం అనుకుంటే నిజంగా ఆ సన్నివేశంలో చరణ్ కి లిప్ లాక్ ఇవ్వడానికి నాకు పెద్ద ఇబ్బందేమీ లేదు. మేము నటులం, మా పాత్రలకి ప్రాణం పోయాలనే ఆలోచన తప్ప మరేమీ మా బుర్రల్లో ఉండదు” అంటు సమాధానమిచ్చింది సమంత.
















