టీజర్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్టింగ్ చూసి సమంత ఏమందంటే..?

వరలక్ష్మీ శరత్ కుమార్.. తండ్రి శరత్ కుమార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే తమిళనాట తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. అయితే హీరోయిన్‌గా కంటే నెగిటివ్ క్యారెక్టర్ల ద్వారానే మంచి పేరొచ్చిందామెకి.. కన్నడ, మలయాళంలోనూ యాక్ట్ చేసింది.. ‘క్రాక్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. జయమ్మగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో అదరగొట్టేసింది.. ‘నాంది’ తర్వాత ‘యశోద’ లోనూ ఆకట్టుకుంది.. ఇక బాలయ్య చెల్లెలిగా ‘వీర సింహా రెడ్డి’ లో పగతో రగిలిపోయే క్యారెక్టర్ చేసి మెప్పించింది..

తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.. ఆమె మెయిన్ లీడ్‌గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్.. ఇక వరలక్ష్మీ నటిస్తున్న తమిళ్ ఫిలిం.. ‘కొండ్రాల్ పావమ్’ (Kondraal Paavam) టీజర్ స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేసింది.. వరలక్ష్మీ అద్భుతంగా నటించిందంటూ ప్రశంసించింది సామ్.. ఈశ్వరీ రావు, చార్లీ, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు.. దయాళ్ పద్మనాభన్ దర్శకుడు.. మార్చి 10న సినిమా థియేటర్లలో విడుదల కానుంది..

టీజర్ చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గానే ఉంది కానీ.. చూశాక మాత్రం ఇది స్ట్రైట్ కోలీవుడ్ మూవీ కాదు.. టాలీవుడ్ సినిమా రీమేక్ అనే విషయం అర్థమైంది.. దయాళ్ పద్మనాభన్ 2020లో పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ మెయిన్ లీడ్స్‌గా ‘అనగనగా ఓ అతిథి’ థ్రిల్లర్ తీశాడు.. పాండమిక్ టైంలో వచ్చిన ఈ సినిమాని ఓటీటీలో బాగానే చూశారు.. పాయల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది..

ఇదే సినిమాని వరలక్ష్మీ శరత్ కుమార్‌తో తమిళంలో తీస్తున్నారు.. చైతన్య కృష్ణ క్యారెక్టర్‌లో సంతోష్ ప్రతాప్ కనిపిస్తున్నాడు.. పాయల్ పాత్రలో వరలక్ష్మీ.. పైగా నెగిటివ్ షేడ్ ఉన్న రోల్.. అలాంటివి తనకి కొట్టిన పిండే కాబట్టి అవలీలగా చేసేసినట్టుంది.. మరోసారి తన ఎక్స్‌ప్రెషన్స్, స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో తమిళ తంబీలను అలరించనుందని టీజర్ హింట్ ఇస్తోంది.. సామ్ సిఎస్ సంగీతమందించిన ‘కొండ్రాల్ పావమ్’ ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus