Samantha, Naga Chaitanya: విడాకుల పోస్ట్ ను డిలీట్ చేసిన సామ్.. కానీ?

అటు అక్కినేని అభిమానులు, ఇటు సమంత అభిమానులు చైసామ్ విడాకులు తీసుకుంటారని కలలో కూడా ఊహించలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా గతేడాది అక్టోబర్ నెలలో వీళ్లిద్దరూ కలిసి చేసిన ప్రకటన అభిమానులను షాక్ కు గురి చేసింది. చైసామ్ విడిపోయిన తర్వాత ఒకే వేదికపై కనిపించలేదు. అయితే బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య సమంత గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు. సమంతతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని చైతన్య చెప్పారు. ఛాన్స్ ఉంటే సమంతతో కలిసి నటించడానికి సిద్ధమేనని చైతన్య చెప్పకనే చెప్పేశారు.

ప్రస్తుతం చైతన్య సమంత వేర్వేరుగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో విడాకుల పోస్ట్ ను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. సమంత విడాకుల విషయంలో నిర్ణయాన్ని మార్చుకుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చైతన్య సమంత మళ్లీ కలిస్తే అభిమానులు ఎంత సంతోషిస్తారో మాటల్లో చెప్పలేం. చిన్నచిన్న గొడవల వల్ల విడిపోయి తర్వాత రోజుల్లో కలిసిన జంటలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. సమంత విడాకుల పోస్ట్ ను డిలీట్ చేసిన విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఎంతో అన్యోన్యంగా ఉన్న చైసామ్ మళ్లీ కలిసి జీవిస్తే బాగుంటుందని చైసామ్ అభిమానులు కోరుకుంటున్నారు. చైతన్య సోషల్ మీడియా ఖాతాలో మాత్రం విడాకుల అనౌన్స్ మెంట్ నోట్ అలానే ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది మాత్రం సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్టులను డిలీట్ చేసే సమయంలో ఆ పోస్ట్ ను డిలీట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. చైసామ్ మళ్లీ కలుస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

చైతన్య నటించిన బంగార్రాజు సినిమా థియేటర్లలో వీక్ డేస్ లో కూడా కోటి రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. తెలంగాణలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. మరోవైపు సామ్ నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus