టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తన స్నేహితులతో కలిసి వెకేషన్ లకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇన్ని రోజులు బాలి వెకేషన్ లో సమంత ఎంజాయ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వెకేషన్ కి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొనే సమంత తాజాగా ఈ వెకేషన్ పూర్తిచేసుకుని చెన్నై వచ్చినట్టు తెలుస్తుంది.
ఇలా చెన్నై వచ్చినటువంటి సమంత (Samantha) తన ప్రాణ స్నేహితురాలు సింగర్ చిన్మయి ఇంటికి వెళ్లారు. చిన్మయికి ఇద్దరు కవల పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా తన ఇంటికి వెళ్ళినటువంటి సమంత చిన్మయి పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆడుతూ ఎంజాయ్ చేయడమే కాకుండా పిల్లలను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఈమె నాటు నాటు పాటకు డాన్స్ వేయించారు.
ఇలా సమంత చిన్న పిల్లలతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఈ వీడియోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా సమంతను చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా చూసినటువంటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈమె ఎలాంటి ఒత్తిడి ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసమే సినిమాలకు విరామం ప్రకటించారు.
దీంతో ఈమె తన లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. అయితే సినిమాలకు సమంత దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈమె అభిమానులను సందడి చేస్తూ ఉన్నారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!