Samantha: హాస్పిటల్ బెడ్ పై సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్..!

సమంత తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ కూడా చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ చేసిన ఫోటోని చూసిన వెంటనే అభిమానులు ఆందోళన చెందడం ఖాయం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సమంత ఇలాంటి పోస్ట్ పెట్టడానికి వచ్చింది ఏంటి అని అభిమానులు కంగారు పడుతున్నారు.

సమంత నటించిన ‘యశోద’ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది అని అంతా సంతోషించేలోపు సమంత ఇలాంటి ఆందోళన రేకెత్తించే పోస్ట్ పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. సమంత ఓ వ్యాధితో బాధపడుతుందట. అది ఇంకా తగ్గలేదట. సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. ” ‘యశోధ’ ట్రైలర్‌ కు మీరు చూపిస్తున్న ఆదరణ చాలా బాగుంది. మీరు నా పై చూపించే ఈ ప్రేమ,ఆదరణే జీవితం నాపై విసిరే కఠినమైన సవాళ్లను ఎదుర్కోడానికి నాకు శక్తిని ఇస్తుంది.

నేను కొంతకాలంగా మ్యూసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం నడవలేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కలిగిన వ్యాధి) అనే వ్యాధితో బాధపడుతున్నాను. నేను కోలుకున్నాక ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాను.కానీ నేను కోలుకోవడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. అయితే మనకి ఏదో అయిపోయింది అని ప్రతీదీ ఇలా బయటకు వచ్చి చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటూ ఉంటాను.

మనకు ఎదురయ్యే సవాళ్ళను అంగీకరిస్తూ ముందుకు సాగాల్సిందే. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెప్పారు. మానసికంగా, శారీరకంగా నేను ఎన్నో కష్టాలను చూశాను.. ఇప్పుడైతే నేను భరించలేననేంత స్థాయిలోనూ కష్టాలు వచ్చాయి.. కానీ అవన్నీ ఎలాగో గడిచిపోయాయి. ఇక ఇది కూడా త్వరలోనే సమసిపోతుంది అని నేను ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus