టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే, సమంత స్టార్ హీరోయిన్ స్టేటస్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న పూజా హెగ్డే రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో సైతం పూజా హెగ్డే హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.
అయితే సమంత పూజా హెగ్డేల మధ్య కోల్డ్ వార్ ఉందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో పూజా హెగ్డే సోషల్ మీడియా ఖాతా నుంచి సమంత నటనను కించపరుస్తూ కామెంట్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత పూజా హెగ్డే తన ఖాతా హ్యాక్ అయిందని వివరణ ఇచ్చారు. ఆ సమయంలో సమంత పూజా హెగ్డే మధ్య మాటలు లేవని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా బీస్ట్ సినిమా నుంచి విడుదలైన హలమిత్తి హబీబో సాంగ్ కు పూజా హెగ్డే స్టెప్పులు వేయడంతో పాటు బెల్లీ డ్యాన్స్ చేసి వీడియోను పోస్ట్ చేయాలని ఛాలెంజ్ విసిరారు.
సమంత ఈ ఛాలెంజ్ ను స్వీకరించి హలమిత్తి హబీబో పాటకు డ్యాన్స్ వేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. పూజా హెగ్డే సమంత డ్యాన్స్ వీడియో గురించి స్పందిస్తూ అద్భుతం అని కామెంట్ చేశారు. పూజా హెగ్డే పాజిటివ్ గా కామెంట్ చేయడంతో సమంత అభిమానులు సంతోషిస్తున్నారు. పూజా హెగ్డే సమంత మధ్య వైరం తొలగినట్లేనని కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో పూజా హెగ్డే సమంత ఒకే సినిమాలో నటిస్తారేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు ఈ ఇద్దరు హీరోయిన్లకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!