Samantha, Naga Chaitanya: చైతన్యత పోటీ నుంచి తప్పకున్న సమంత?

టాలీవుడ్ క్రేజీ కపుల్స్ లో నాగచైతన్య సమంత జంట ఒకటిగా ఉండేది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఏదో ఒక విషయం ద్వారా ఇద్దరు వార్తలలో నిలుస్తున్నారు. ఈ విధంగా వీరిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక విడాకుల తర్వాత వీరిద్దరూ సినిమాల విషయంలో ఎంతో బిజీగా మారిపోయారు.ఇద్దరు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే నాగచైతన్య నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా సమంత నటించిన సినిమాల సైతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత ఇద్దరూ ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్యతో పోటీ నుంచి సమంత వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. సమంత నటించిన యశోద సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదల కానుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు 11వ తేదీ నాగచైతన్య అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల కానుంది.

ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఏర్పడబోతోంది ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఇద్దరి అభిమానుల మధ్య ఎంతో ఆత్రుత నెలకొని ఉంది.అయితే ఈ పోటీ నుంచి సమంతా తప్పుకున్నట్లు సమాచారం. సమంత నటించిన యశోద సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా యశోద సినిమా విడుదల వాయిదా పడిందని తెలియగానే చైతన్య అభిమానులు సమంత భయపడి తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యశోద సినిమా గురించివస్తున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేశ్, ఉన్ని ముకుందన్ వంటి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus