Samantha: ఎన్టీఆర్, బాలయ్య ఫెయిల్ అయ్యారు.. సమంత సక్సెస్ అవుతుందా..?

సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ రేపు అనగా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. నిజానికి గత ఏడాది నవంబర్లోనే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ ఈ చిత్రాన్ని 3D లో విడుదల చేయడానికి ప్లాన్ చేయడం వల్ల డిలే అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది.నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక ఈ చిత్రం కథ చాలా మందికి తెలిసిందే.

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ని ఆధారం చేసుకుని గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. (Samantha) సమంత ‘శకుంతల’ గా కనిపిస్తుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ‘శాకుంతలం’ వంటి కథతో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదటిది ‘శకుంతల’ పేరుతో ఎన్టీఆర్, బి.సరోజా దేవి హీరో, హీరోయిన్లుగా రూపొందింది.ఇందులో భరతుడి పాత్రలో కుట్టి పద్మిని నటించింది. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. అటు తర్వాత కొన్నేళ్ళకు ఎన్టీఆర్ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దుష్యంతుడిగా బాలకృష్ణ నటించారు. ఈ సినిమా కూడా ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఇదే చిత్రాన్ని ఏకకాలంలో హిందీలో కూడా రూపొందించడానికి సీనియర్ ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.

కానీ తెలుగు వెర్షన్ ప్లాప్ అవ్వడంతో సీనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రం హిందీ వెర్షన్ ను విడుదల చేయలేదు. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలకు కలిసిరాని ‘శకుంతల’ కథ సమంతకి కలిసొస్తుందా.. హిట్టు కొడుతుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus