Samantha: ఆ ఇంస్టాగ్రామ్ పోస్టులతో భారీగా సంపాదిస్తున్న సమంత!

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి సమంతకు సైతం మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన క్షణాలు వైరల్ అవుతుంది.ఈక్రమంలోనే తనకి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల బ్రాండ్ లకు సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. ఈ విధంగా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలురకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.

అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా చేసే పోస్టుల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారు. ఇలా సమంత నెలకు ఇన్స్టాగ్రామ్ ద్వారా 2 కోట్లకు పైగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది. సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ రేంజ్ లో సంపాదించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న సమంత సోషల్ మీడియా వేదికగా పలు బ్రాండ్లకు చెందిన పోస్టులు చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తున్నారు.

ఈ విధంగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా ఈమె నెలకు ఈ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు. ఇలా ఒక వైపు సినిమాలలోను మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సమంత రెండు చేతులా సంపాదిస్తున్నారు.

సమంత ప్రస్తుతం హీరోయిన్ గా సక్సెస్ అవుతూ మరోవైపు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇలా వ్యాపారవేత్తగా కూడా సమంత మంచిగా సంపాదిస్తున్నారు .ఏది ఏమైనా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను సమంత బాగా పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus