Samantha: ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవాలి వైరల్ అవుతున్న సమంత లేటెస్ట్ పోస్ట్!

సినీనటి సమంత ప్రస్తుతం తన సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే కాస్త స్థిమిత పడుతోందని తెలుస్తోంది. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కొంతకాలం పాటు సంతోషంగా ఉన్న అనంతరం తనకు కష్టాలు మొదలయ్యాయి. నాగచైతన్యతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇలా విడాకుల సమయంలో ఈమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు విడాకులకు కారణం సమంతదే తప్పు అంటూ ఈమె గురించి ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి.

అయితే ఆ విమర్శలు అన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా ముందడుగు వేసింది. అంతలోనే మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి తనని మరోసారి వెనక్కి తోసేసింది.ఈ వ్యాధి కారణంగా దాదాపు అయిదారు నెలలపాటు ఇంటికే పరిమితమైనటువంటి సమంతా ధైర్యంతో ఈ వ్యాధిని జయించింది. ఇలా ఈ వ్యాధి నుంచి బయటపడినటువంటి ఈమె తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం (Samantha) సమంత ఓ వ్యక్తితో చాలా సన్నిహితంగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ఆ వ్యక్తి ఎవర అంటూ పెద్ద ఎత్తున వార్తలు మొదలయ్యాయి.నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నటువంటి సమంత మరోసారి ప్రేమలో పడ్డారని ఆయనే తన రహస్య ప్రేమికుడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా సమంత చేసినటువంటి పోస్ట్ కనుక చూస్తే ఈమె ప్రేమలో ఉన్నారా అన్న సందేహం కలగక మానదు. చిలీ దేశానికి చెందిన ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా చెప్పిన ఓ కొటేషన్ ఈమె షేర్ చేశారు.

చావు నుంచి మనల్ని ఏది కాపాడ లేనప్పుడు ప్రేమతో జీవితాన్నికాపాడుకోవడమే అన్న కొటేషన్ షేర్ చేశారు. దీంతో ఈమె ప్రేమలో పడ్డారా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus