Samantha: ఆ విషయంలో సమంత నిర్ణయాలు మారాల్సిందేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత యశోద సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమాకు సమంత మెయిన్ అట్రాక్షన్ కావడంతో సమంతపైనే ఈ సినిమా బడ్జెట్ భారం పడుతోంది. తొలిరోజు యశోద మూవీకి తక్కువ మొత్తంలోనే కలెక్షన్లు రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నాన్ థియేట్రికల్ హక్కులు ఎక్కువ మొత్తానికి అమ్ముడవడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో లక్షల్లో మాత్రమే కలెక్షన్లు వస్తున్నాయి. యశోద మూవీ కలెక్షన్ల విషయంలో పుంజుకోవాలంటే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సమంత తన సినిమాలలో హీరో పాత్రలలో తెలుగులో అంతో ఇంతో పాపులర్ అయిన తెలుగు హీరోలను ఎంపిక చేసుకోవాలని

అలా చేస్తే సమంత సినిమాలకు బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పెద్దగా గుర్తింపు లేని హీరోలు సమంతకు జోడీగా నటిస్తుండటంతో ఫ్యాన్స్ సైతం ఒకింత ఫీలవుతున్నారు. సామ్ తన సినిమాల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సినిమాసినిమాకు సమంత రేంజ్ పెరుగుతుండగా సమంత పారితోషికం ప్రస్తుతం 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం. సమంత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

సమంతకు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సమంత నటించిన సినిమాలు సమంత రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. సమంత పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు ఓటేస్తుండటం గమనార్హం. ఇతర భాషల నుంచి కూడా సమంతకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus