Samantha: ‘యశోద’ సినిమా చెప్పిన టైంకి రాదా..?

  • June 29, 2022 / 03:48 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలు సైన్ చేస్తోంది. ఓ పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క కమర్షియల్, లవ్ స్టోరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విమెన్ సెంట్రిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అదే సమయానికి చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయి. దీంతో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ ఈ పోటీలో సమంత వెనక్కి తగ్గదని భావించారు. కానీ కొన్ని కారణాల వలన ‘యశోద’ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. దీనికి కారణం మాత్రం బయటకు రాలేదు.

త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో సమంత గర్భవతిగా కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు సమంత చేసిన సినిమాలకు భిన్నంగా ఈ స్టోరీ ఉండబోతుంది. తెలుగులో చిత్రీకరిస్తోన్న ఈ సినిమాను మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ లాంటి తారలు కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పులగం చిన్నారాయణ, డా.చల్లా భాగ్యలక్ష్మి ఈ చిత్రానికి మాటలను అందిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus