Samantha: అలాంటి పాత్రలో తొలిసారి నటిస్తున్న సమంత!

కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్లు ఒకే తరహా పాత్రలకే పరిమితమయ్యేవారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించడానికి హీరోయిన్లు అస్సలు ఆసక్తి చూపేవారు కాదు. అయితే ప్రేక్షకులు ప్రస్తుతం విభిన్నమైన పాత్రల్లో నటించే హీరోయిన్లకు ఓటేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో రొటీన్ పాత్రలకు గుడ్ బై చెబుతూ భిన్నమైన పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా సమంత నటిస్తున్నారు.

విజయ్ సేతుపతి హీరోగా నయనతార హీరోయిన్ గా కాత్తువాక్కుల రెండు కాదల్ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారని సమాచారం. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నయనతార పాత్రకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో సమంత పాత్రకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. సమంత పాత్రతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయని సమాచారం.

సమంత ఈ సినిమాతో నటిగా మరో మెట్టు పైకి ఎక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ పోషించని పాత్రలో సమంత ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం. అయితే సమంత నిజంగానే నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారని చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సమంత పాత్రల ఎంపికతోనే తను నటిస్తున్న సినిమాలపై అంచనాలను పెంచుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించిన సమంత అభినయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

కథ నచ్చితే వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా సమంత ఓకే చెబుతున్నారు. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ కథపరంగా గ్లామర్ గా కనిపించాల్సి ఉంటే మాత్రం సమంత అలాంటి పాత్రలకు అంగీకరిస్తున్నారు. సమంత నటించిన శాకుంతలం త్వరలో రిలీజ్ కానుండగా యశోద మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. సమంత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus