Samantha: సమంత సిటాడేల్ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకప్పుడు కేవలం సౌత్ సినిమాలకు మాత్రమే పరిమితమైనటువంటి సమంతా ప్రస్తుతం బాలీవుడ్ హాలీవుడ్ అనే తేడాలు లేకుండా సినిమాలలో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతున్నటువంటి సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సమంత జంటగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నటువంటి ఈ సిరీస్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సిరీస్ చేయడం కోసం సమంత తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

సమంత (Samantha) ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కానీ ఈ సిరీస్ కోసం ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా తీసుకొని రెమ్యూనరేషన్ ఈమె తీసుకుంటున్నారని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్లో చేయడం కోసం సమంత ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా సమంత ఈ స్థాయిలో డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా ఆమె అడిగినది మొత్తం ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇలా సమంత ఇప్పటివరకు తన కెరియర్ లో ఏ సినిమా కోసం తీసుకొని రెమ్యూనరేషన్ ఈ వెబ్ సిరీస్ కోసం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా హీరోయిన్గా ఒక సిరీస్ కోసం 10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇలా ఈ సిరీస్ కోసం ఈమె ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న విషయం తెలిసి నేటిజెన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ తో పాటు సమంత ఖుషి సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus