Samantha: సమంత ఓకే చెప్పడం వెనుక ఇంత కథ ఉందా?

  • July 22, 2022 / 05:01 PM IST

గతేడాది థియేటర్లలో విడుదలైన పుష్ప ది రైజ్ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవడానికి సమంత కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే. ఊ అంటావా సాంగ్ ద్వారా సమంత యూత్ ను ఆకర్షించడంతో పాటు ఆ పాట వల్ల వార్తల్లో నిలిచారు. గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన ఆ పాట విషయంలో చాలామంది పురుషుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు సమంత స్పెషల్ సాంగ్స్ కు ఓకే చెప్పడం ఏంటనే ప్రశ్నలు వినిపించాయి.

అయితే కాఫీ విత్ కరణ్ షోలో సమంత మాట్లాడుతూ నేను, నాగచైతన్య విడిపోయిన సమయంలో నా గురించి నెగిటివ్ ప్రచారం జరిగిందని అన్నారు. ఆ సమయంలో నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించడానికి నా దగ్గర జవాబులు లేవని సమంత చెప్పుకొచ్చారు. నేను ఓపెన్ గా ఉండాలని అనుకున్నానని అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పానని సమంత తెలిపారు. నాగచైతన్యతో విడిపోయిన కొన్నిరోజుల తర్వాత ఊ అంటావా సాంగ్ లో నాకు ఛాన్స్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఊ అంటావా సాంగ్ నాకు ఎంతో నచ్చిందని ఈ కారణం వల్లే సాంగ్ లో యాక్ట్ చేశానని సమంత చెప్పుకొచ్చారు. పురుషాధిక్య సమాజంలో పురుషుల లోపాలు ఎత్తిచూపడానికి ఊ అంటావా సాంగ్ సరైనదని నేను భావించానని సామ్ కామెంట్లు చేశారు. నాలాంటి స్టార్ సెలబ్రిటీ చెబితే ఈ పాట అందరికీ చేరవవుతుందని భావించానని సామ్ అన్నారు.

కరణ్ జోహార్ భర్త నుంచి విడిపోయిన సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నావని అడగగా భర్త కాదు మాజీ భర్త అని సమంత సమాధానం ఇచ్చారు. అయితే సమంత భవిష్యత్తులో మా మధ్య సఖ్యత వస్తుందేమో అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ వల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో చైసామ్ మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus