Samantha: ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం ఎంతో మంచిది: సమంత

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడినటువంటి ఈమె తన సినిమాల కారణంగా వ్యాధి నుంచి కాస్త కోలుకోగానే తిరిగి ఇండస్ట్రీ లోకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఇవే మరో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

సమంత మరోసారి మయోసైటీసిస్ వ్యాధి భారీపడ్డారని అయితే ఈసారి మంచి ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసమే ఈమె సినిమాలకు విరామం ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈమె కమిట్ అయినటువంటి ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో నటిస్తున్నటువంటి సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సమంత (Samantha) ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జూలై 13 వ తేదీ ఈ సిరీస్ షూటింగ్ పూర్తి కావడంతో ఈరోజు నా జీవితంలో ఎంతో స్పెషల్ అని తెలియజేశారు అదేవిధంగా విరామం తర్వాత ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం ఎంతో మంచిదని తెలిపారు. రాజ్ అండ్ డీకే లాంటి ఫ్యామిలీ అందరికీ అవసరం నా ప్రతి యుద్ధంలో పోరాడటానికి సహాయం చేశారు.

ఎప్పుడు నన్ను వదులుకోవాలనుకోలేదు ప్రపంచంలో అన్నిటికంటే మిమ్మల్ని గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. మీరు నాకోసం మరో మంచి పాత్ర సిద్ధం చేసే వరకు మీకు థాంక్స్ అంటూ ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus